వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు వచ్చిపడుతున్న పిడుగులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలను కూడా బలి తీసుకుంటున్నాయి.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ బావులను తలపించాయి. ఇదిలావుంటే ఓల్డ్ సిటీ పరిధిలోని కార్వాన్ లో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడినట్లు సమాచారం. పిడుగు పడడంతో మంటలు అంటుకొని కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్దమైంది.
ఇటీవల దేశంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వడగండ్ల వాన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఎండలతో మండిపోతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ.... రైతులు నష్టపోయారు. పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు ముంచుకొస్తున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎండలు ఏ రేంజ్ లో మండిపోయాయో అందరికీ తెలిసిందే. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మొన్నటి వరకు ఎండలతో బాధపడుతుంటే.. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట […]