ఇటీవల దేశంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వడగండ్ల వాన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఎండలతో మండిపోతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ.... రైతులు నష్టపోయారు. పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు ముంచుకొస్తున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.
అబ్బా మార్చి నెల వచ్చేసింది. ఇక ఏముందీ ఎండలు దంచి కొడతాయి. ఉక్కపోత, వేడి గాలి, సరిగా పని చేయలేని పరిస్థితి. నీళ్లు ఎక్కువగా తాగేసి, ఆహారం మీదకు మనసు పోదు. దీంతో నీరసం, నిద్ర కూడా సరిగా పట్టదు. ఇవన్నీ వేసవి కాలం మొదలైన నాటి నుండి ప్రతి ఒక్కరూ ఏదో ఓ సమ్యసతో సతమతమయ్యే వాళ్లే. అయితే ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగాళ్ల వాన పడటంతో ప్రజలు ఎండల నుండి స్వాంతన పొందారు. అటు బాగా ఎండలు మండే బెజవాడలోనూ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అలాగే రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
వాతావరణ మార్పుల కారణంగా ఎండాకాలంలో వర్షాలు పడటంతో కాస్త గందగోళానికి గురౌతున్నారు ప్రజలు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా రెండు రోజుల నుండి మూడు రోజుల పాటు మురిపించిన వర్షాలు.. మళ్లీ కనిపించలేదు. ఎండలు కూడా వెన్నెలను తలపిస్తున్నాయి. అయితే మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. గురువారం నుండి వారాంతం వరకు మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య భారతంలో ఈ నెల 23 నుండి 25 మధ్య వడగండ్ల వాన కురుస్తుందని, తూర్పు, మధ్య భారత్‌లో మార్చి 24 నుంచి 25 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల వడగండ్ల వానలు పడతాయని హెచ్చరించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేడిమి, భూ ఉపరితలానికి ముందు రుతుపవనాల ప్రారంభానికి దారితీసే రెండు విపరీతాలు వాస్తవానికి ముడిపడి ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇది అసాధారణం కానప్పటికీ, ఈ సంవత్సరం ప్రీ మాన్సూన్ కార్యకలాపాలు సాపేక్షంగా ప్రారంభంలోనే ప్రారంభమయ్యాయని నిపుణులు తెలిపారు. వాయువ్య రాజస్థాన్ లో వాయుగుండం ఏర్పడిందనీ, ఈ తుఫాను నుంచి నాగాలాండ్ వరకు తూర్పు-పడమర ద్రోణి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలలో కూడా మేఘామృతం కనిపిస్తున్నాయని పేర్కొంది. దక్షిణ అస్సాంను అనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలలో రానున్న కొన్నిగంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
i) Thunderstorm with hailstorm activity over east India on 21st March, 2023 and significant reduction thereafter.
ii) Fresh spell of rainfall/thunderstorm/hailstorm activity over Northwest India during 23rd-25th March and Central and adjoining eastern India during 24th-25th Mar pic.twitter.com/vyYuh7GT1o— India Meteorological Department (@Indiametdept) March 21, 2023