తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శవంతంగా తయారయ్యింది. హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ సినిమారంగం అభివృద్ధికి పాటుపడుతున్నాది. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు ఆహ్వానించారు.
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. […]
ఐపీఎల్ 2022 సీజన్ లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా సాయంత్రం అయ్యిందంటే అందరూ టీవీలు, మొబైల్స్ కు అతుక్కుపోతారు. ఈ నెల రోజులు బస్, ట్రైన్, మెట్రో ఇలా ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకుని ఐపీఎల్ లైవ్ చూస్తుంటారు. కానీ, అది ఫ్రీగా రాదుగా హాట్ స్టార్ యాప్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే ఐపీఎల్ లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అంతటి […]
మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన ఓటిటి లైవ్ షో గత శనివారం అన్ని హంగులతో మొదలైన సంగతి తెలిసిందే. షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్ హౌస్ ఇలా ఉండబోతుంది.. అలా ఉండబోతుంది అంటూ ప్రోమోలతో రచ్చ లేపారు నిర్వాహకులు. ఇకపై నాన్ స్టాప్ బిగ్ బాస్ సందడే.. నో ఫుల్ స్టాప్స్.. నో కామాస్ అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా డైలాగ్స్ తో ఇంటరెస్ట్ కలిగించాడు. వారం తిరగకుండానే పెద్ద […]
షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా తన కూతురును హీరోయిన్గా పరిచయం చేస్తూ చిత్రనిర్మాణం మొదలుపెట్టింది – అదీ తన సొంత ఓటీటీ […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]