సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం చేసే ఓటీటీ సంస్థలు.. తాజాగా నయన్-విఘ్నేష్ శివన్‌ల వివాహ వేడుక ప్రచార హక్కులకు భారీ ఆఫర్‌ను ప్రకటించి మరి సొంతం చేసుకున్నాయి. ఆ వివరాలు..
నయనతార, విఘ్నేష్‌శివన్ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్‌ప్లిక్స్ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో 5 రోజుల నుంచే ఈ సంస్థ వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సముద్రతీరంలో అద్భుతమైన అద్దాల మేడలో వివాహ వేదికను తీర్చి దిద్దారు. ఇందుకు ఢిల్లీ, ముంబయిల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. 50 మందికి పైగా బౌన్సర్లు, ప్రైవేటు రక్షకులను రప్పించి వివాహ వేడుక పరిసర ప్రాంతాలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆహ్వాన పత్రిక ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు.
ఇది కూడా చదవండి: Wikki Nayan Wedding: నయనతార- విగ్నేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!
ఇక దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి కొద్ది గంటల ముందు తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో ఓ ట్వీట్ చేశారు. అందులో ‘‘ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా జీవితాన్ని నయనతారకు సమర్పించబోతున్నాను. నా బంగారంతో మరి కొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నాం అన్న భావనే ఉత్సాహాన్నిస్తోంది..’’అని పేర్కొన్నారు. కాగా తమ వివాహ వేడుక సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, అనాథాశ్రమాలలో లక్షమందికి అన్నదానం కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు.
హాజరైన ప్రముఖులు..
ఈ వివాహానికి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ఖాన్, నిర్మాత బోనీ కపూర్ ప్రత్యేకంగా విచ్చేసి నవ దంపతులకు శుభాకాంక్షలు అందించారు. నటుడు రజనీకాంత్, శరత్‌కుమార్, రాధిక, సూర్య, కార్తీ, విజయ్‌సేతుపతి, దర్శకుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, అట్లీ, ఏఆర్ రెహ్మాన్, అనిరుధ్, కుష్భు సుందర్, విక్రమ్ ప్రభు, ఎడిటర్ మోహన్, దర్శకుడు మోహనరాజా, ఐసరి గణేష్, శాలిని అజిత్‌కుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అత్యంత సన్నిహితులతో పాటు 200 మంది సినీ ప్రముఖులనే నయనతార, విఘ్నేష్ శివన్ ఆహ్వానించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Nayanthara Vignesh Shivan Marriage: వివాహ బంధంతో ఒక్కటయిన నయనతార-విఘ్నేష్ శివన్! ప్రత్యేక ఆకర్షణగా వాటర్ బాటిల్స్!
అయితే వివాహ ప్రచార హక్కులను అమ్ముకోవడంపై గతంలోనే పలు విమర్శలు వచ్చాయి. జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయే వివాహ వేడుకను ఇలా అమ్ముకోవడం ఏంటని పలువురు నెటిజనులు విమర్శించారు. మరి కొందరు మాత్రం.. వారి పెళ్లి.. వారి ఇష్టం.. డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు కాదనుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Vignesh Shivan: గోరు ముద్దలు తినిపిస్తూ.. నయన్‌పై ప్రేమను చాటుకున్న విఘ్నేష్!