మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన ఓటిటి లైవ్ షో గత శనివారం అన్ని హంగులతో మొదలైన సంగతి తెలిసిందే. షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్ హౌస్ ఇలా ఉండబోతుంది.. అలా ఉండబోతుంది అంటూ ప్రోమోలతో రచ్చ లేపారు నిర్వాహకులు. ఇకపై నాన్ స్టాప్ బిగ్ బాస్ సందడే.. నో ఫుల్ స్టాప్స్.. నో కామాస్ అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా డైలాగ్స్ తో ఇంటరెస్ట్ కలిగించాడు.
వారం తిరగకుండానే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. టీవీ ఛానల్ లో రావట్లేదని ఫ్యాన్స్ అంతా మూకుమ్మడిగా హాట్ స్టార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని.. లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీ కాదు.. మనీతో సబ్ స్క్రైబ్ చేసి చూస్తుండగా.. ఇంతలోనే లైవ్ స్ట్రీమింగ్ కి బ్రేక్ అంటూ షాకిచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం. షో ప్రారంభానికి ముందే హౌస్ అదిరిపోయింది.. ఇకపై లైవ్ ఎక్కడా ఆగదు అంటూ చెప్పిన వారే.. ఇప్పుడు హౌస్ సిద్ధం కానీ కారణంగా 24 గంటలపాటు బ్రేక్ అని స్క్రోలింగ్ వదిలింది.ఫిబ్రవరి 26 నుండి మార్చి 2న అర్ధరాత్రి 12 గంటల వరకూ బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ ప్రసారమైంది. అయితే 12 తర్వాత లైవ్‌ని ఆపేశారు. “మీకు మరింతగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు హౌస్ ని సిద్దం చేస్తున్నాం. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుండి లైవ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఏరోజుకి ఆరోజు పూర్తి ఎపిసోడ్ ని రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తాం. తప్పక చూడండి’ అని స్క్రోలింగ్ వేశారు.
ఇక ఫస్ట్ డే ఎపిసోడ్ నే తిరిగి ప్రసారం చేశారు. నాన్ స్టాప్ లైవ్ అన్నారు.. ఫుల్ స్టాప్ లేదు.. కామా లేదని చెప్పారు. అప్పుడే దుకాణంలో రిపేర్ అంటూ కొత్త పంచాయతీ తెరమీదకి వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంటే గురువారం అంతా పాత ఎపిసోడ్ లే రిపీట్ అవుతాయన్న మాట. బిగ్ బాస్ 24 గంటలు లైవ్ అని ఆశగా సబ్ స్క్రైబ్ చేసుకున్నవాళ్లంతా ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ ఆపేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.