డబ్బున్నోడి దగ్గర లాగేయ్, పేదోడికి పంచేయ్ అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ధనవంతుల దగ్గర డబ్బులు కొట్టేసి పేదోళ్ళకి పంచిపెట్టే హీరోలని చూసి చప్పట్లు కొడతారు. అయితే సినిమాల్లో హీరోయిజం చూపించినట్టే నిజ జీవితంలో కూడా హీరోయిజం చూపిస్తారా అంటే అవుననే చెప్పాలి. ధనవంతుల నుంచి అదనంగా డబ్బులు లాగుతూ ఆ డబ్బులను పేదల కోసం వినియోగిస్తున్నారు. ఎక్కడంటే?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత మొత్తంలో ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు దృష్టి పెడుతున్నారు. కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే.. ధర ఎక్కువేమో అన్నది అందరి అభిప్రాయం. అలాంటి వారికి ఈ వార్త శుభవార్తగానే చెప్పవచ్చు. కేవలం 50 వేలు లేదా అంతకంటే.. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ బైకుల సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ దండయాత్ర కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. గడిచిన 10 రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది 9వ సారి. ఇవాళ కూడా ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసలు పెరిగాయి. హైదరాబాద్లో ఇంకాస్త ఎక్కువే పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం(మార్చి31) రోజున హైదరాబాద్లో పెట్రోల్ […]
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరో సంక్షోభం సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. తూర్పు ఉక్రెయిన్ లోని లుహాన్క్స్ , దోనెట్క్స్ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒక రోజు గడువులో ఏకంగా ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతంపై మిలిటరీ దాడులు చేపట్టాలని […]
న్యూ ఢిల్లీ- ప్రతి రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీల రోజు వారి రివ్యూలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో పెట్రోల్, […]