బంగారానికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. భారతదేశంలో అయితే అకేషన్ ఏదైనా బంగారం కొనాల్సిందే అంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. అలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బంగారం పేరు చెబితే చాలు మహిళలు చంద్ర ముఖిలా మారిపోతుంటారు అంటారు కానీ.. ఆపదలో ఆదుకునేది ఆ వస్తువే. అందుకే భర్తలను పోరు పెట్టైనా సరే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు మహిళలు. దీనిపై ఆసక్తినే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు.
కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బ్యాంకు మేనేజర్, ఓ ఖాతాదారుడు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. విషయం ఏంటంటే పట్ణంలోని డీసీసీబీ బ్రాంచ్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే నకిలీవి తిరిగి ఇచ్చారని ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ 2017లో 35.81 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.4,98,600 రుణం తీసుకున్నాడు. 2019 డిసెంబర్‌లో రెన్యూవల్ చేసుకున్నాడు. మొత్తం రుణం, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,02,436 కాగా గురువారం మధ్యాహ్నం […]
చిత్తూరు క్రైం– బంగారం.. ఈ పేరు వింటేనే మహిళల మొహాల్లో వెలుగు వస్తుంది. బంగారం అంటే మక్కువ చూపని వారుంటారా చెప్పండి. అందులోను మన దేశంలో బంగారం సంప్రయాంలో భాగమని చెప్పవచ్చు. పైగా బంగారం అతి ఖరీదైన లోహం. దీంతో బంగారానికి అంత విలువ ఇస్తారు అంతా. ఐతే బంగారం కొనుగోళ్లలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోవడం ఖాయం. తక్కువ ధరకే బంగారం అమ్ముతామని కేటుగాళ్లు చాలా మందిని మోసం చేసిన ఎన్నో ఘటనలను మనం […]