చనిపోయిన మనిషి.. తిరిగి బతకడం సాధ్యామా.. అంటే వైద్యులతో పాటు సామాన్యులు కూడా కాదనే అంటారు. కానీ కొన్ని సార్లు చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుని.. మన నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. చనిపోయాడని.. భావించి.. అంత్యక్రియలకు సిద్ధమైన వేళ.. లేచిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి మరణించాడు. ఇక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దింపుడు కళ్లెం దగ్గర.. ఆగి.. […]
కొంతమందికి జంతువులతో అటాచ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో కుటుంబ సభ్యుల్లా ఫీలవుతుంటారు. వాటికి ఏమై నా అయితే తట్టుకోలేరు. కుక్కలు కూడా యజమానికి ఏమైనా అయితే తట్టుకోలేవు. యజమాని కనిపించకపోయినా, చనిపోయినా ఏడుస్తాయి. ఇక సొంత పిల్లల్లా చూసుకున్న కుక్కలకి ఏమైనా అయితే మనుషులు ఇంకా ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకుంటారు. కుక్కల మీద ప్రేమతో కేక్ కట్ చేసి వాటి పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తారు. అవి చనిపోతే మనుషులకి చేసినట్టే అంత్యక్రియలు […]
పున్నామ నరకం నుంచి కాపాడే వారే పుత్రులు అనేది నానుడి. అయితే.. నేటి కాలంలో కొందరు పుత్ర రత్నాలు తల్లితండ్రులను ఆ నరకంలోకి నెట్టేస్తున్నారు. కన్నవారు బతికున్న సమయంలో వారిని పట్టించుకోకుండా, చనిపోయాక వారి అంత్యక్రియలకి హాజరుకాకుండా తమ కఠిన హృదయాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తాజాగా ఒరిస్సాలో చోటు చేసుకుంది. కానీ.. ఆ తల్లి కడుపున పుట్టిన ఆడపిల్లలే అన్నీ తామై ఆ అమ్మని పున్నామ నరకం నుంచి తప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. […]
కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. కరోనాతో తల్లి చనిపోతే ఆమె శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ వేశాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతను ముందుకు రాకపోవడంతో కోడలు రంగంలోకి దిగడం గమనార్హం. పీపీఈ […]
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. రెండు సార్లు కరోనా వచ్చినా గొప్ప పనికి పూనుకున్నారు. మహమ్మారి కారణంగా మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది.అనుబంధాలకు తావులేదంటే కలికాలమని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కరోనా కాలంతో పోల్చుకుంటే కలికాలమే లక్ష రెట్లు మేలTనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోయిన వాళ్లు ఎటూ తిరిగి రారని, తమను తాము రక్షించుకోవడం తక్షణ కర్తవ్యమనే భావనతో, సొంత వాళ్ల మృతదేహాలను కాటికి చేర్చలేని […]
కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున […]