అందరికి భిన్నంగా ఓ మహిళా కావాలనే ఒంటరితనం తెచ్చుకుంది. అది కూడా ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 500 రోజులు ఒంటరిగా 230 అడుగుల గుహలో గడిపింది. చివరగా శుక్రవారం నాడు సురక్షితంగా గుహ నుంచి బయటకి వచ్చింది. చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన ఆమెను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది.. అద్దె కట్టే పనిలేకుండా పదహారేళ్లు ఒంటరిగా గుహలో జీవనం సాగించాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇంటి అద్దె కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక గుహలోకి వెళ్లాడు. ఇక ఆయన జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యపోక మానరు.
కొన్ని రోజుల క్రితం రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుని.. నరకయాతన అనుభవించి.. ఓ యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీన్ని మరిచిపోకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి.. సెల్‌ఫోన్ కోసం రెండు బండ రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు. మంగళవారం సాయంత్రం నుంచి.. ఆ వ్యక్తి బండరాళ్ల మధ్య చిక్కుకుపోగా.. అతడిని కాపాడేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు […]
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు. అసలే కరోనా సమయం కావడం జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]