అందరికి భిన్నంగా ఓ మహిళా కావాలనే ఒంటరితనం తెచ్చుకుంది. అది కూడా ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 500 రోజులు ఒంటరిగా 230 అడుగుల గుహలో గడిపింది. చివరగా శుక్రవారం నాడు సురక్షితంగా గుహ నుంచి బయటకి వచ్చింది. చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన ఆమెను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. సమాజంలో అందరితో కలిసి ప్రతి ఒక్కరు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఒంటరిగా జీవించాలని ఎవరైన భావిస్తారా?. ఎవరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు. కారణం ఒంటరితనం అనేది అందరినీ బాధ పెడుతుంది. అందుకే చాలా మంది దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఓ మహిళా మాత్రం కావాలనే ఒంటరితనం తెచ్చుకుంది. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా 500 రోజులు ఒంటరిగా 230 అడుగుల గుహలో గడిపింది. చివరగా శుక్రవారం నాడు సురక్షితంగా గుహ నుంచి బయటకి వచ్చింది. మరీ ఆ డెరింగ్ లేడీ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పెయిన్ లోని గ్రానాడా ప్రాంతానికి చెందిన ఫ్లామిని అనే 50 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తుండేది. ఆమె స్వతహాగా అథ్లెట్, పర్వతారోహకురాలు. అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి పర్వతారోహణకు వెళ్లేది. అయితే రెండేళ్ల క్రితం కరోనా సమయంలో ఆమె మదిలో ఓ ఆలోచన మెదిలింది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటిగా గుహలో ఉంటే ఎలా ఉంటుంది భావించింది. ఇదే విషయాన్ని తన స్నేహితులకు, బంధువులకు తెలిపింది. కొద్ది మంది సభ్యుల సాయంతో 2021 నవంబర్ 21న గుహలో అడుగుపెట్టింది.
గ్రానాడా ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ గుహలో 230 అడుగుల లోపలకి వెళ్లి గడిపింది. ఆమెకు అవసరమైన ఆహారం, నీరు అంతా ఆ బృందం సమకూర్చే వాళ్లు. పండ్లు, నీరు ఎక్కువగా తీసుకునేదంట. గుహలో రెండు కెమెరాలు, మైక్ లు అమర్చి.. ఆమె భద్రతను పర్యవేక్షించేవాళ్లే తప్ప ఆమెతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. మొదట్లో వారితో ఆమె మైక్ ద్వారా మాట్లాడేది. ఆ తరువాత సమయం ఎంతయిందో కూడా తెలుసుకునే అవకాశం లేకపోవడంతో రోజులు లెక్కవేయడం మానేసింది. పుస్తకాలు చదువుతూ, హాండ్ కర్చిఫ్, హ్యాట్ లు తయారు చేస్తూ ఫ్లామిని గుహాలో కాలం వెల్లదీసింది.
అలా 500 రోజులు గుహలో గడిపిన తరువాత ఇటీవలే ఫ్లామిని బయటకు వచ్చింది. అయితే 500 రోజుల తరువాత బయటకు వచ్చిన ఆమె ముఖం చాలా వింతగా మారిపోయింది. గుహ నుంచి బయటకు రాగానే ఆమె తన బృందాన్ని హగ్ చేసుకుంది. “నేను రోజులు లెక్కపెట్టుకోవడాన్ని ఆపేసే క్షణం వచ్చింది. 160 నుంచి 170 రోజులు గుహలో ఉన్నానేమో అనుకున్నాను” అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈమె వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ డెరింగ్ లేడీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.