ఓ వాలంటీర్ వీఆర్వోకు గట్టి షాక్ ఇచ్చాడు. పట్టాదారు పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి చివరకు ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు ఓ వీఆర్వో. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిపై నిత్యం వందల ఫిర్యాదులు వస్తుంటాయి. తరచూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
సమాజంలో పాతుకుపోయిన అతి ముఖ్యమైన అవలక్షణం లంచం. చావు బతుకుల్లో ఉన్న మనిషిని కాపాడాలన్నా లంచం ఇవ్వకపోతే.. అంతే సంగతులు అన్న పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అవినీతిని నిర్మూలించడం కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. దాడులు చేసినా ప్రభుత్వాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలను జలగల్లా పీడిస్తూ.. లంచం వసూలు చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ అధికారుల జీతం వేలల్లో ఉండగా.. వారి ఆస్తులు మాత్రం వందల కోట్ల రూపాయలుగా ఉంటున్నాయి. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ […]