కళ్లు చెదిరే క్యాచ్‌! ఉమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలోనే ది బెస్ట్‌

STUNNING catch from Mikayla Hinkley - Suman TV

కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌లను సాధారణంగా పురుషుల క్రికెట్‌లోనే చూస్తాం. ఉమెన్స్‌ క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌లు ఉన్నప్పటికీ.. గాల్లో శరీరం పూర్తిగా తేలుతూ రాకెట్‌లా దూసుకెళ్తున్న బంతిని పట్టడం చాలా అరుదు. కానీ అలాంటి అద్భుతమైన స్టన్నింగ్‌ క్యాచ్‌ను పట్టింది ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మికైలా హింక్లే. ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌లో శనివారం సిడ్నీ సిక్సర్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నికోల్‌ బోల్టన్‌ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి దూకి క్యాచ్‌ పట్టింది మికైలా హింక్లే. ఈ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్‌ విజయం సాధించింది.