వైద్యం ప్రభుత్వాల కనీస భాద్యత- ఉత్తమ్

హైదరాబాద్- ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల కనీస, ప్రాథమిక బాధ్యత అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న ఉత్తమ్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని,పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మీ దీవెనలతో రెండు మూడు రోజులలో ఇంటికి డిశ్చార్జ్ అవుతాను.. అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీ భవన్తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారన్నారని ఉత్తమ్ తెలిపారు. వారందరినీ అభినందనలు తెలియజేశారు.

పేద ప్రజలు కరోనా బారిన పడి వైద్య సేవలు అందాక నానా కష్టాలు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. బెడ్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు దొరక్కపోవడం అత్యంత బాధాకరమన్నారు. హాస్పిటల్స్లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, రెమిడిసివర్ ఇంజెక్టన్లు ఇప్పించాలని తమకు ఫోన్లు వస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here