యూపీ పోలీసులకు సీఎం యోగి దిమ్మతిరిగే షాక్!

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆథిత్యనాధ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సర్వీస్ చేసే ప్రభుత్వ అధికారుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే వారిని నిర్మొహమాటంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తానని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు నేరాల సంఖ్య తగ్గించడానికి గ్యాంగ్ స్టర్స్ ని ఏరిపారేశారు. ఇప్పుడు యోగి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

yga minకళంకిత అధికారులను పోలీసు వ్యవస్థలో ప్రధాన పదవుల్లో నియమించరాదని.. తీవ్ర నేరాల్లో చిక్కుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వీస్ నుంచి డిస్మస్ చేస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఈ వివరాలను వెల్లడించింది. నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని.. అలాంటివారికి పోలీసు శాఖలో స్థానం లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రుజువులతో సహా ఇటువంటివారిని గుర్తించి, ఓ జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. అసలు ముఖ్యమంత్రి యోగా ఇంత ఆగ్రహావేశానికి గురి కావడానికి గల కారణం చూస్తే.. ఇటీవల జరిగిన ఘటన.

korag minఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో హోటల్‌లో ఉన్న బిజినెస్ మెన్‌పై పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి.. ఐడీ చూపాలని తమ ప్రతాపం చూపించారు. ఈ సమయంలో కాన్పూరు వ్యాపారి మనీశ్ గుప్తా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను తప్పుపట్టగా.. యోగీ సర్కార్ స్పందించింది. ఈ సంఘటనపై ఎస్‌పీ నార్త్ దర్యాప్తు చేస్తారని గోరఖ్ పూర్ ఎస్ఎస్‌పీ విపిన్ చెప్పారు.