ఇటీవల కాలంలో ట్విట్టర్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేస్తున్నారు. అకౌంట్ హ్యాకింగ్ గురైన వారిలో సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరూ ఉంటారు. తరచూ ట్వీట్టర్ అకౌంట్స్ హ్యాకింగ్ కు గురవుతున్నాయనే సమాచారం బయటికి వస్తోంది. తాజాగా యూపీ సీఎం కార్యాలయం ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడింది.
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయ ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి హ్యాక్ చేశారు. హ్యాక్ అయిన అరగంట వ్యవధిలోనే 500 ట్వీట్లు CMO ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేయబడ్డాయి. దీంతో అకౌంట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఖాతా పునరుద్ధరించబడింది. యూపీ సీఎంవో ట్విట్టర్ ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు ..తర్వాత కార్టూన్లు, ఎన్ఎఫ్టీల చిత్రాలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. వాటితో పాటు ‘ఎన్ఎఫ్టీలను యానిమేషన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి?’ అనే ట్యుటోరియల్ను ట్వీట్ చేశారు.హ్యాక్ చేసిన ఖాతా స్క్రీన్‌షాట్‌లను ..యూపీ పోలీసులు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు షేర్ చేశారు. అధికారులు రంగంలోకి దిగి ఖాతాను పునరుద్ధరించారు. హ్యాకర్లు పెట్టిన ట్విట్లన్నీ డిలీట్ అయ్యాయి. ప్రస్తుతం UP CMO ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Uttar Pradesh Chief Minister Office’s Twitter account hacked. pic.twitter.com/aRQyM3dqEk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.