వామ్మో.. ఈ చిన్నారి స్పైడ‌ర్ మ్యాన్ కి సిస్ట‌ర్ ఉందే.. వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం కనీ వినీ ఎరుగని వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాలంలో చిన్న పిల్లలు ప్రతి విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఏదైనా చూస్తే ఇట్టే ప‌ట్టేస్తున్నారు. హైప‌ర్ యాక్టివ్ గా వుంటున్న ఈ జ‌న‌రేష‌న్ పిల్ల‌లు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌నే కాదు… ఆన్ లైన్ లో వ్యూవ‌ర్స్‌ని కూడా ఆక‌ట్టుకుంటున్నారు.

babayeఒకప్పుడు మనకు సూపర్ హీరోస్ అంటే.. హీ మ్యాన్, సూప‌ర్ మ్యాన్, స్పైడర్ మాన్ అని తెలుసు.. ఐర‌న్ మ్యాన్‌, హ‌ల్క్‌, ఎవెంజర్స్ హీరోస్ కి పిల్ల‌లు పెద్ద ఫ్యాన్స్‌. ఇక స్పైడర్ మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్పైడ‌ర్ మ్యాన్ పిల్ల‌ల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ వుంది. దానికి సంబంధించిన డ్రెస్సులు, టాయ్స్ అంటే కూడా పిల్లలకు తెగ ఇష్టం. తాజాగా ఓ అమ్మాయి వీడియో కి సంబంధించిన తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందా అనుకుంటున్నారా? రివ‌ర్స్ లో వుండి కేవలం కాళ్ల పాదాలు పైకి ఎగబాకుతుంది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన చిన్నారి వీడియోలో గోడకు మూలన ఎలాంటి సాయం లేకుండా రివ‌ర్స్ లో వుండి కేవలం కాళ్ల పాదాలు .. చేతులతో స్పైడ‌ర్ మ్యాన్ లా పైకి ఎక్కింది. స్పైడ‌ర్ మ్యాన్ కి సిస్ట‌ర్ లా నిమిషం లోపే ఇంటి సీలింగ్ వ‌ర‌కు పాకేసింది. అంతేకాదు పైకి పాకుతూ వెళ్లిన ఆ చిన్నారి చేతులు గొడ‌కి త‌న్ని పెట్టి కాళ్లు గాల్లో ఆడిస్తూ స్టంట్స్ చేసింది. అనంతరం ఒక్కసారిగా పైనుంచి కిందకు దూకుతోంది. అద్భుత విన్యాసాలను చేసిన ఈ చిన్నారి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఫన్‌ వైరల్‌ విడ్స్‌ అనే ట్విటర్‌ ఖాతాలో 55 సెకన్ల నిడివితో ఈ వీడియోను పొందుపరిచారు. ఈ వీడియో చూసి స్పైడర్ మెన్ కి ఈ చిన్నారి సిస్ట‌ర్ లా వుందంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేశారు.