ప్లంబర్ ని కోటీశ్వరుడిని చేసిన ‘డ్రీమ్‌ 11’

మనిషికి అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తట్టుతుందో తెలియదు. అలాంటి అదృష్టం ఓ ప్లంబర్ ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. జాగా ఐపీఎల్(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) ఓ ప్లంబ‌ర్ జీవితాన్నే మార్చేసింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన డ్రీమ్‌-11లో అత‌డు కోటి రూపాయ‌లు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోట్ల మంది ఈ గేమ్ పై బెట్టింగులు పెడుతున్నారు.. కొంత మంది దివాలా తీస్తే.. కొంత మంది మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు.

dreemleve minఈ క్రమంలోనే అక్టోబరు 10న.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై బెట్‌ వేయగా ఓ ప్లంబర్ కి రూ.కోటి సొంతమైంది. బిహార్‌లోని కటిహార్‌ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్‌ హంస్‌వర్‌ గ్రామంలో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నాడు. ఇటీవల తనతో పనిచేసే ఓ వ్యక్తి ద్వారా డ్రీమ్‌ 11 గురించి తెలుసుకున్నాడు. అప్ప‌టి వ‌రకు బ‌బ్లూ కు ఆ యాప్ గురించి తెలీదు. స‌ద‌రు వ్య‌క్తే ఆ యాప్‌ను బ‌బ్లూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. ఎలా ఆడాలో నేర్చించాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై బెట్‌ వేయగా.. కోటి రూపాయలు గెల్చుకున్నాడు.

ఈ సందర్భంగా బబ్లూ మండల్ మాట్లాడుతూ.. నాతో పని చేసే వ్యక్తి డ్రీమ్‌ 11 గురించి చెప్పాడు. వాస్తవానికి అప్పటి వరకు నాకు అసలేం తెలియదు. నా ఫోన్‌లో ఆ వ్యక్తే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశాడు. వాడటం కూడా నేర్పించాడు. కొద్దిరోజుల క్రితమే నేను అది వాడడం మొదలుపెట్టా.. మొదట రూ.200 పెట్టాను. నా అదృష్టం బాగుంది.. రూ.కోటి గెలుచుకున్నాను. రూ. 30 లక్షలు పన్ను రూపంలో కట్‌ చేశారు. 70 లక్షలు నాకు వచ్చాయి. ఈ డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని, కొంత మొత్తాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తానని బబ్లూ చెప్పాడు.