భారతీయ వనిత అద్భుత విజయం.. కిలిమంజారో పర్వతంపై త్రివర్ణ పతాకం!

భారత దేశంలో మహిళలు ఎంతటి క్లిష్టతరమైన విజయాలైనా సాధించి తీరుతారని పలు సందర్భాల్లో రుజువు చేశారు. పట్టుదల.. ధైర్యం.. చేయాలన్న తపన ఉంటే.. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉన్న సంగతి తెలిసిందే.

GEETHA minతాజాగా భారతీయ యువతి ప్రపంచం గర్వించదగ్గ విజయం సాధించింది. భారత యువ ట్రెక్కర్ గీతా సమోటా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించి సంచలనం సృష్టించింది. శిఖరాగ్రంపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. ఔరా అనిపించింది. ఈ మేరకు భారత దేశ నలుమూలల నుండి గీతా సమోటాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వపడేలా చేసిన గీతా సమోటాకి చప్పట్లు కొట్టి మరీ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటేగీతా సమోటా ఆగష్టు 13న యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని (5,672 మీటర్లు) అధిరోహించిన సంగతి తెలిసిందే. నెలరోజుల తర్వాత ఇప్పుడు ఆఫ్రికాలోని కిలిమంజారోని అధిరోహించింది. నెల రోజుల వ్యవధిలో రెండు శిఖరాలను అధిరోహించిన భారతీయ వనితగా గీతా సమోటా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా గీతా సమోటాపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈమె చేసిన ఘనతను మెచ్చుకుంటూ టాంజానియాలోని హై-కమీషనర్ ఆఫ్ ఇండియా బినయా ప్రధాన్ ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.