ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడి వాతావరణం అన్నింటికి తట్టుకొని మనో ధైర్యంతో ఈ పర్వతాన్ని అధిరోహించాలి. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినదనే చెప్పాలి. తాజాగా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్.
ఇందుకోసం దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన కల నెరవేర్చుకుంది. నివేదా అభిరుచుల్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని తనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని అది ఇన్నాళ్లకు నెరవేరిందని అంటుంది నివేదా థామస్. 2016లో నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన నటనతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఆ మద్య యన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రంలో కూడా నటించింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీ రోల్ లో నటించింది నివేదా థామస్. కాగా, కిలిమంజారోను అధిరోహించినప్పటి ఫొటోలను నివేదా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమె చేసిన సాహాసాన్ని మెచ్చుకుంటూ.. ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.