షాప్ లో కూర్చోడానికి వెళ్లిన కుర్రాడు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు!

ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని మనల్ని నవ్విస్తే , కొన్ని కోపం తెప్పిస్తాయ్‌, మరికొన్ని భయపెడతుంటాయ్‌. సరిగ్గా ఇదే తరహాలోనే ఉన్న ఈ వీడియోను చూస్తే మనకి భయం వేయక మానదు.

ratsnake minతాజాగా అంలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోకి ఓ కుర్రాడు మొబైల్ చూసుకుంటూ టేబుల్ పై నుంచి అవతలివైపు వెళ్లే ప్రయత్నం చేశాడు.. ఆ సమయంలో బల్లపై కూర్చున్నాడు. ఒక్కసారిగా ఫ్లోర్ దగ్గర కనిపించిన దృశ్యం చూసి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఇంతకీ మనోడు ఎందుకు పరుగెత్తాడో తెలుసా? ఓ పెద్ద పాము ఎలుకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ దాని వెంటపడుతోంది.

ఆ ఎలుక ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ రెండు ఒక్కసారే తన వైపు రావడంతో మనోడి గుండె గుభేల్ అంది.. అంతే పరుగో పరుగు. ఓసారి షాపులోంచి బయటకు వెళ్లిన పాము… మళ్లీ ఎలుకను వెంబడిస్తూ షాపులోకి దూరింది. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. మొత్తానికి ఆ కుర్రాడు తృటిలో తన ప్రాణాలు దక్కించుకున్నాడు.. లేదంటే ఎలుక బదులు తాను బలై ఉండేవాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.