త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమనబడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమనబడుతుంది. చాలాసార్లు వ్యక్తి స్వార్థానికి లోబడి త్యాగం చేస్తాడు. నేను కొద్దిగా త్యాగం చేస్తే ఎంతో గొప్ప లాభం దొరుకుతుందనుకోవడం రజోగుణ త్యాగం. కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు. కరోనా వైరస్ ఇప్పుడు యువత ప్రాణాలను కూడా తీస్తోంది. కరోనా సెకండ్ వేవ్లో చోటుచేసుకుంటున్న మరణాల్లో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన నారాయణ దభాల్కర్ అనే 85 ఏళ్ల పెద్దాయన చేసిన త్యాగం స్ఫూర్తిని నింపుతోంది.నారాయణ ఏప్రిల్ 22న కరోనా వైరస్తో ఇందిరా గాంధీ రుగ్నాలయలో చేరారు. వైద్యులు అతడిని హాస్పిటల్లో ఉండే చికిత్స పొందాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఓ మహిళ కరోనాతో బాధపడుతున్న తన 40 ఏళ్ల భర్తను హాస్పిటల్లో చేర్చుకోవాలంటూ వైద్యులను ప్రాదేయపడటం నారాయణను కదిలించింది. దీంతో ఆయన తన బెడ్ను అతడికి కేటాయించాలని వైద్యులను కోరాడు. తన కంటే అతడికే ఈ బెడ్ ఎక్కువ అవసరం ఉందని తెలిపాడు.చివరి క్షణాల్లో హాస్పిటల్కు బదులు మాతో గడపుతానని ఆయన అన్నారు. తాను రెండు మూడు రోజులు ఆ బెడ్ మీదే ఉంటే.. అత్యవసరమైన వ్యక్తులకు చికిత్స దొరకదని అన్నారు’’ అని తెలిపారు. నారాయణ ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఏప్రిల్ 19న ఆయనకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. విషాదం ఏమింటే.. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత రోజే నారాయణ చనిపోయారు.