త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమనబడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో […]