అల్పాహారం బిల్లు – ప్రధాని మెడకు ఉచ్చుగా మారిందా?!.

ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లులపై దుమారం రేగుతోంది.   బ్రేక్‌ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా ప్రజా ధనాన్ని వినియోగించినట్టు స్థానిక పత్రిక ప్రచురించింది. ఇదేం విడ్డూరం ఎక్కడా అనుకుంటున్నారు…ఆ దేశం – ఫిన్లాండ్. పత్రిక పేరు – ఇటేలేహ్తి!. అతిచిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టడమేగాక, కరోనా నియంత్రణలో మెరుగైన పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌. అధికారంలోకి రాగానే అనేక సంస్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సనా మారిన్‌   చిక్కుల్లో పడింది.   యూరప్‌లో అతితక్కువ కేసులు వచ్చిన దేశాల్లో ఫిన్లాండ్‌ కూడా ఒకటి కావడం విశేషం.  ప్రధాని తన కుటుంబంతో కలిసి కేసరాంటలోని తన అధికారిక నివాసంలో ఉంటున్నారు.

4593586 1920x1080 1
 

ప్రధాని తన బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ప్రజల సొమ్మును అక్రమంగా వినియోగించుకుంటున్నారని వార్తలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ప్రధాని తన కుటుంబం మొత్తం బ్రేక్‌ఫాస్ట్‌ కోసం నెలకు 365 డాలర్లను ప్రభుత్వ ఖజానా నుంచి క్లెయిమ్‌ చేసుకుంటూ వస్తున్నారని స్థానిక పత్రిక కథనాలతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రధాని తన బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ప్రజల సొమ్మును వినియోగించుకోవచ్చని దేశ చట్టాల్లో ఎక్కడా లేదని అక్కడి న్యాయ నిపుణులు కొందరు చెబుతున్నారు.  ఈ ఆరోపణకు సంబంధించిన దర్యాప్తును స్వాగతిస్తూ ప్రధాని సనా స్పందించడం మరో విశేషం.