తెలంగాణకు అరుదైన గౌరవం.. బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా పోచంపల్లి

UNWTO Award for Telangana Pochampally - Suman TV

తెలంగాణ పల్లెకు అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిని ప్రపంచంలోనే బెస్ట్‌ టూరిజం విలేజ్స్‌లో ఒకటిగా యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్జనైజేషన్‌ గుర్తించింది. డిసెంబర్‌ 2న యుఎన్‌డబ్ల్యుటీఓ 24వ సెషన్‌లో బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డును అందించనున్నారు. ఈ కార్యక్రమం స్పెయిన్‌ దేశంలో జరగనుంది. కాగా తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కడం నిజంగా గొప్ప విషయం. కాగా దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ అవార్డు కోసం దేశం తరపున నామినేట్‌ కాగా పోచంపల్లికి అవార్డు దక్కింది.