యువతిపై కన్నేసిన కామంధుడు..వీడియోలు తీసి ఆపై..!

Kamandhudu looking for a young woman take videos and then - Suman TV

నేటి కాలంలో కొంతమంది దుర్మార్గులు నమ్మివచ్చిన ఆడపిల్లలపై మోసం చేస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. దీంతో ఆగకుండా ఏదో రకంగా యువతులకు తెలియకుండా వీడియోలు తీయటం, ఆపై బ్లాక్ మెయిల్ చేయటం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌ పట్టణంలోని సెక్టార్‌ 52లో ఉన్న ఓ ల్యాబ్‌లో యువతి ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ యువతి చేసే కంపెనీలోనే సహోద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు సచిన్‌ సింగ్‌ తివారీ అనే యువకుడు.

అయితే ఎప్పటి నుంచో ఆ యువతిపై మనోడు కాస్త కన్నేశాడు. ఎలాగైన ఆ యువతిని లోబరుచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఏనాడు కూడా ఆ యువతి ఆ దుర్మార్గుడి ఆలోచనకు తలొగ్గలేదు. అయితే ఓ రోజు ఆ యువతి ఓ రూమ్ లో బట్టలు మార్చుకుంటుండగా దొంగచాటున మోబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. దీంతో అదే వీడియోలను ఆ యువతికి చూపించాడు. ఖంగుతిన్న యువతిని మనోడు బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. ఇక ఇంతటితో ఆగకుండా యువతిపై పలుమార్లు అత్యాచారాలకు దిగి శారీరక కోరికలు తీర్చుకున్నాడు.

Kamandhudu looking for a young woman take videos and then - Suman TVఅయితే తాజాగా ఓ రోజు ఓ ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు. అక్కడ కూడా లైంగికంగా వేధించటం మొదలు పెట్టాడు. ఆ యువతి కాదనటంతో కత్తితో బెదిరింపసాగాడు. దీంతో యువతి అరుపులు కేకలు బయటికి బలంగా వినిపించాయి. ఏం జరుగుతుందని వెళ్లి చూస్తే మనోడి దుర్మార్గాలు బయటపడ్డాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక మేల్కొన్న మనోడు ఉరుకుల పరుగుల మధ్య పత్తకు లేకుండా పారిపోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.