ఈ మధ్యకాలంలో చాలా మటుకు భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు అందమైన జీవితాలను నట్టెట్ట ముంచేస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటికీ ఎన్నో సాఫిగా సాగిన పచ్చని కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది హర్యానాలోని కురుక్ష్రేత్ర సమీపంలోని అమీన్ అనే ఓ గ్రామం. ఫరూక్ అనే వ్యక్తికి గతంలో ఓ యువతితో వివాహం జరిగింది.
అయితే వీరిద్దరి సంసారంలో మనస్పర్దలు రావటంతో ఒకరినొకరు కాదనుకుని విడిపోయారు. అలా కొంత కాలానికి ఫరూక్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యజీవితం సాఫిగానే సాగింది. అయితే ఈ మధ్యకాలంలో భర్త ఫరూక్ బిజినెస్ లో కాస్త బిజీగా మారిపోవటంతో ఆ యువతి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయే మనం అనుకునే వివాహేతర సంబంధంగా మారింది. దీంతో భర్త ఇంట్లో లేని రోజు ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి రప్పించుకుని ఆ యువతి ఎంజాయ్ చేస్తోంది. అలా ఈ యువతి తెర చాటు వ్యభిచారం విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ విషయం ఎలాగో తన భర్తకు తెలిసింది. దీంతో భర్త ఫరూర్ మందలించే ప్రయత్నం చేసినా భార్య వక్రబుద్ది మాత్రం అస్సలు మారలేదు. ఇక భార్య ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఓ రోజు ప్రియుడితో పాటు ఆ ఆంటీ బెడ్ రూంలోకి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఇక ఆ ఆంటీ ప్రియుడితో పాటు భర్తను అంతమొందించాలని భావించి ఇద్దరూ కలిసి దారుణంగా హత్య చేశారు. దీంతో అనుమానం రాకుండా ఆ మహిళ ప్రియుడి సాయంతో అదే ఇంట్లో గోతి తీసి పూడ్చి పెట్టింది. ఇక కొన్నాళ్లకు భర్త ఆచూకి తెలియకపోవటంతో అతని కుటుంబ సభ్యులు భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక 20 రోజుల తర్వాత భార్య ప్రియుడితో పాటు హత్యచేసిందనే విషయం బట్టబయలైంది. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.