నగరి వైసీపీలో బయటపడ్డ విభేదాలు.. రోజా ఫైర్!

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ లో మరో సారి బయట పడ్డ విభేదాలు. గత కొంత కాలంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతల నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. నిండ్ర మండలంలోని ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు మద్దతు ఇవ్వలేదు. స్థానిక నేతలు చక్రపాణితో పాటు.. ఆయన తమ్ముడు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదు అని మండిపడ్డ రోజా. అయితే ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థులను బరిలో దింపిన రోజా తాను అనుకున్న అభ్యర్థులను బరిలోకి దింపి రెండు మునిసిపాలిటీల్లోనూ తన హవా కొనసాగించారు.

RAOGE minగత కొంత కాలంగా నగరి నియోజకవర్గంలో నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డిదే హావ ఎక్కువగా ఉంది. తమ పట్టు కోల్పోకుండా వీరిద్దరూ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపిపి ఎన్నికల్లో వర్గవిబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. విజయపురం ఎంపిపిగా రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజునూ అభ్యర్థిగా అనుకున్నారు పార్టీ వర్గాలు. మరోవైపు తాను ప్రతిపాదిచిన జమునను ఎంపిపిగా గెలిపించుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఆ సమయంలో ఎవరు నోరు మెదపక పోయినా.. నిండ్రలో మాత్రం వర్గపోరు బహిర్గతం అయింది. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేసారు. ఇక్కడే మరోసారి రాజకీయ విభేదాలు బయట పడ్డాయి.

వైసీపీలో కొనసాగుతున్న శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రవన్ని రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలనీ ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయం చేశారు. సెప్టెంబర్ 24న జరగాల్సిన ఎన్నికలకు ఐదుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. ఇక లాభం లేదని ఎమ్మెల్యే రోజా స్వయంగా రంగంలోకి దిగి కోఆప్షన్ మెంబర్ గా అనిల్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. మరోవైపు భాస్కర్ రెడ్డిని ఎంపీపీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. దీంతో నగరిలో వర్గపోరు మరోమారు తేటతెల్లం అయిందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి తన పార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారని ఎమ్మెల్యే రోజా చెబుతూనే ఉన్నారు.. దీనిపై సీఎం జగన్ కి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.