కరోనాతో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌ షిప్‌.. ఇలా అప్లై చేయండి

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అన్ని రంగాలను కుదేలుచేసింది. ఇక మరణాల సంగతి చెప్పక్కర్లేదు. మృతదేహాలతో శశ్మానవాటికల ముందు వరుస కట్టిన ఆ భయంకర దృశ్యాలు ఇంకా గుండెను ముక్కలు చేస్తున్నాయి. కరోనా మృత్యుకేళితో ఎందురో చిన్నారులు అనాథలయ్యారు. పిల్లలను పొగుట్టుకుని తల్లిదండ్రులు కడుపుకోతకు గురయ్యారు. పేరెంట్స్‌ ఆసరా లేక ఎందరో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అలాంటి వారి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Special Scholarship for those who have lost a mother through Corona - Suman TVకరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు అండగా నిలబడటానికి . ‘కోవిడ్‌ క్రైసిస్‌ సపోర్ట్‌’ పేరుతో స్కాలర్ షిప్ ను ప్రకటించింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 1 వ తరగతి నుంచి పోస్టు గ్రెడ్యుయేషన్ వరకూ రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకూ స్కాలర్షిప్ ను అందించనుంది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేస్తుకోవడానికి చివరి తేదీ 31 అక్టోబరు 2021. బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
ఎవరు అర్హులు..
2020 జనవరి కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు.. 1వ తరగతి నుంచి పీజీ వరకూ ఈ స్కాలర్ షిప్ ని అందిస్తారు. కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.

అప్లై చేయండి ఇలా..
బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఈ–మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి.. అడిగిన డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చేయాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్..
తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు, గతేడాది మార్కుల లిస్ట్, స్కూల్ అడ్మిషన్ లెటర్, స్కూల్ ఫీ రిసిప్ట్, వీటితో పాటు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీచర్ లేదా డాక్టర్ నుంచి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన రిఫరెన్స్ లెటర్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లికేషన్ ఫీల్ చేసే సమయంలో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని విషయాలను పరిశీలించి విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేసి ఒకే సారి స్కాలర్‌ షిప్‌ డబ్బులు అందజేస్తారు.