రోజా కూతురికి ఐలవ్ యూ చెప్పిన యువకుడు, షాక్ ఇచ్చిన అన్షూ

maxresdefault 2 1
Roja famili pic

ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే.. టీవీ షోల్లోను సందడి చేస్తోంది. ఇక రోజాతో పాటు ఆమె కుమార్తె అన్షు కు కూడా సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రోజా, అన్షులు కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. ఈ మధ్యకాలంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ లోకి ప్రేవేశించింది అన్షు. ఇన్‌స్టా అకౌంట్ చేరిన అనతి కాలంలోనే ఆమెకు వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి చేశారు. తాజాగా అన్షు తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ చెప్పింది. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమెకి స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి అన్షు దిమ్మదిరిగే జవాజు ఇచ్చింది. తను కూడా ఐ లవ్‌ యూ.. థాంక్యూ అంటూ రిప్లే ఇచ్చి యువకుడిని అవాక్కయ్యేలా చేసింది.

roja180520 2
roja daughter anshu

ఇక నెటిజన్లు అన్షుని అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పింది. మీకు భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ తెరిచే ఆలోచన ఉందా అని ఒకరు అడగ్గా.. మీరే చెప్పండి గాయ్స్.. నేను యూట్యూబ్ ఛానల్ తెరవాలని మీరు కోరుకుంటున్నారా.. నాకైతే తెరవాలని ఉంది అని ఆన్సర్ చేసింది. ఇక మీకు వ్యాపారం మీద ఆసక్తి ఉందా.. ఒకవేళ ఉంటే ఎలాంటి వ్యాపారం చేస్తారని మరొకరు అడిగితే.. నాకు అన్షూ అనే షూలైన్ స్టార్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని మనసులో మాట చెప్పింది. అబ్బాయిల్లో మీకు నచ్చే లక్షణాలు ఏంటని ఇంకొకరు అడిగితే.. ఏదో హాని జరుగుతుందనే భయం ఉండొద్దు, మంచి వ్యక్తిత్వం ఉండాలని చెప్పుకొచ్చింది.