నటీనటులు వారి యాక్టివిటీస్‌కు, వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు వీరు పొరపాటుగా లేక తెలియక చేసిన పనులు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నారు
సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు సామాన్యులకు దగ్గరవుతున్నారు. ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటూ.. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. వారి యాక్టివిటీస్‌కు, వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు వీరు పొరపాటుగా లేక తెలియక చేసిన పనులు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నారు. ఇక నెటిజన్లు ఆడాడేసుకుంటున్నారు. తప్పు చేస్తే చెప్పే విధానంలో అభిమానులం అని చెప్పుకునే సోషల్ మీడియా సైనికులు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు సినీ సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ నటి ఇటువంటి సమస్యల్లోనే చిక్కుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..? ఆమె చేసిన తప్పేంటంనే వివరాల్లోకి వెళితే..
నాగార్జున మన్మధుడు సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఈ సినిమా థియేటర్లలో అయితే హిట్ కాలేదు కానీ.. టీవీల్లో వేసిన ప్రతిసారి చూసి ఎంజాయ్ చేస్తుంటారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్. అందుకే ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు మరో హీరోయిన్ కూడా నటించిన సంగతి విదితమే. ఆమె పేరు అన్షు అంబానీ. ఆ సినిమాలో చాలా క్యూట్ లుక్స్‌లో కనిపిస్తుంది. చక్కని అభినయాన్ని ప్రదర్శించి మెప్పు పొందింది. ఆ తర్వాత రాఘవేంద్ర, మిస్పమ్మ వంటి చిత్రాల్లో నటించి.. తెరకు దూరమైంది. రెండు మూడు సినిమాలకు కాస్ట్యుమ్ డిజైనర్‌గా పనిచేసింది. కొంతకాలానికి సచిన్ అనే వ్యాపార వేత్తను వివామం చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యింది. ఆమెకు పాప, బాబు. అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేస్తుందని వినికిడి. ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఈ నటే ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఇంతకు ఏమైందంటే.. హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది. దేవుడి దగ్గర చెప్పులు వేసుకుని కనిపించింది. సోషల్ మీడియాలో తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఓ ఫోటో వివాదమైంది. అందులో వినాయక విగ్రహం వద్ద అన్హు ఎత్తు చెప్పులు వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడం ఏంటి అంటూ కోపంతో రగిలిపోతున్నారు. ఏకంగా నెగిటివ్ కామెంట్స్, బూతులతో విరుచుకు పడుతున్నారు. అనుకోకుండా జరిగినా, ఆమె మాత్రం వివాదంలో ఇరుక్కుపోయింది. ఆమె దీనిపై ఏమైనా సంజాయిషీ ఇస్తుందేమో చూడాలి.