ఆమె ఎంతో మంది మహిళలకు ప్రేరణ ఈ తెలుగింటి ఆడబడుచు. ఆమె పేరు దీపిక ఎం.పాటిల్. తండ్రి మండవ విష్ణు వర్ధన్ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్స్ తో చదుకుని ఐపీఎస్ గా ఎంపికయ్యారు. వృత్తి రీత్యా విష్ణువర్ధన్ ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే దీపిక బాల్యం విద్యాభాస్యం సాగాయి. తండ్రి వృత్తిరీత్యా బదిలీల నేపథ్యంలో దీపిక చదువు కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది. ఇక బిట్స్ పిలానీ పట్టాను రాజస్థాన్ లో పుచ్చుకున్నారు. ఆమె దీపికా ఎం పాటిల్ ప్రస్తుతం పార్వతి పురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టిన దీపికా ఎం పాటిల్ . ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబం. స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా ఆమదాలలంక. తాతగారిది వ్యవసాయ కుటుంబం. ఆమె భర్త విక్రాంత్ పాటిల్. ఈ పేరు కూడా చాలామంది వినే ఉంటారు. ఈయనా ఐపీఎస్ ఆఫీసరే. ప్రస్తుతం విజయవాడలో డీసీపీగా చేస్తున్నారు. దీపికా బ్రదర్ హర్షవర్ధన్ కూడా ఐపీఎస్.అరుణాచల్ ప్రదేశ్‌లో ఎస్పీగా చేస్తున్నారు. దీపిక చదువు పూర్తయింది. సివిల్స్ రాసింది. ఫస్ట్ ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టింది. ఐపీఎస్ అయింది. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్ కమాండెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత విజయనగరం జిల్లా కేంద్రంలోనూ పని చేసింది. తర్వాత దిశ స్పెషల్ ఆఫీసర్‌గా అపాయింట్ అయింది. తండ్రి పోలీసు అధికారిగా వరుస బదిలీలు అవుతుంటే 13 స్కూళ్లు మారింది. తన ఫ్రెండ్స్ మారారే తప్ప చదువులో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. తన జీవితంలో తనతో పాటు ప్రయాణం చేసే జీవిత భాగస్వామి విషయంలోనూ అంతే. సోదరుడు హర్షవర్ధన్, విక్రాంత్ పాటిల్ ఒకటే బ్యాచ్ కావడంతో హర్షతో పాటు ఇంటికి వస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. విక్రాంత్, దీపికలు ఒకరినొకరు ఇష్టపడ్డారు.
తల్లిదండ్రులు, భర్త సైతం ఆమె కెరీర్ ఆలోచనలకు,ఆకాంక్షలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకున్నారు. అందుకే దీపిక సెలెక్షన్ కరెక్టని మరోసారి ప్రూవ్ అయింది. అసలు పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యావు అని అడిగితే ఓ ఇంటర్వ్యూలో దీపిక చెప్పిన సమాధానం ’’నాన్న చేతిలో లాఠీని చిన్నప్పటి నుంచి చూసేదానిని ఇంట్లోవారందరూ పోలీసు అధికారులే కావడం ఇవన్నీ నాకు ఆ ప్రొఫెషన్‌పై ఆసక్తిని పెంచాయి. అలాగే నాకు పోలీసు అధికారి కావడం పెద్ద కష్టంగా కూడా అనిపించకుండా చేశాయి.’’ ఆమె ఆసక్తి ఆమె కుటుంబం ప్రభావం ఆమె ప్రతిభ మనకు ఓ మంచి లేడీ ఐపీఎస్ అధికారి దొరికారు. ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లల ఆకాంక్షలు, తెలివితేటలకనుగుణంగా ప్రోత్సాహాన్ని ఇస్తే ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో మన సమాజానికి అందుతాయి.