ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల భలే రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో ప్రధాన పార్టీలో గెలుపే ధ్యేయంగా గట్టి పట్టుమీద ఉన్నాయి.. అందుకు ఆ నియోజకవర్గ ప్రజల ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు పార్టీ పెద్దలు. ఇక అధికార పార్టీ ముఖ్య నేతలు హుజూరాబాద్ లో ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి.. కనిపించిన వారందరికి పార్టీ కండువాలు కప్పుతూ రాజకీయాలను అపహాస్యం చేస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి గురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి.. గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడం.. ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ పై గవర్నర్ తమిళిసై స్పందించారు.
బుధవారం రాజ్ భవన్‌లో మాట్లాడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైల్ తన దగ్గరే ఉందని… ఒకే చెప్పేందుకు తనకు సమయం లేదన్నారు. ఇది గవర్నర్ నామినేషన్ అని వెల్లడించారు. సోషల్ వర్క్ చేస్తున్నారా ? అనేది చూస్తున్నట్లు, ఆ విషయాన్ని స్టడీ చేయడం జరగుతోందని గవర్నర్ వెల్లడించడం గమనార్హం. దీంతో టీఆరెస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. మరి కొంతకాలం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూడాల్సి వచ్చింది.