పరిమిత ఓవర్ల స్టార్ క్రికెటర్లందరూ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్, సియటెల్ ఒర్కాస్ మ్యాచ్ లో భాగంగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఓపెనర్ ఫిన్ అలెన్ అనుకోకుండా రనౌటయ్యాడు.
సాధారణంగా బ్యాటింగ్ బాగా చేస్తున్నప్పుడు రనౌట్ అవ్వడం చాలా దురదృష్టకరం. ఇక ఆ రనౌట్ ఊహించని రీతిలో జరిగితే బ్యాటర్ జీర్ణించుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. సమన్వలోపం వల్ల కొంతమంది రనౌట్ అయితే మరి కొందరు వారి సొంత తప్పిదం కారణంగా నిర్లక్ష్యంగా రనౌటై వికెట్ సమర్పించుకుంటారు. మరి కొందరైతే విచిత్రకర రీతిలో రనౌటై అందరికీ షాకిస్తారు. ఇలాంటి రనౌట్లు ఇప్పటికే క్రికెట్ లోచాలా చూసేసాము. అయితే ఎప్పుడూ జరగని ఒక రనౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఫిన్ అలెన్ తన నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకున్నాడు. పూర్తి వైరల్ ఇప్పుడు చూద్దాం.
పరిమిత ఓవర్ల స్టార్ క్రికెటర్లందరూ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్, సియటెల్ ఒర్కాస్ మ్యాచ్ లో భాగంగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఓపెనర్ ఫిన్ అలెన్ అనుకోకుండా రనౌటయ్యాడు. దీనికి కారణం ఏంటో చెబితే షాకవ్వాల్సిందే. పరుగు తీస్తుండగా అలెన్ బ్యాట్ పిచ్ మధ్యలో ఇరుక్కు పోయింది. దాంతో, చేసేదేం లేక వేగంగా పరుగెత్తాడు. కానీ, ఆలోపే ఫీల్డర్ మెరుపు త్రోతో వికెట్లను పడగొట్టాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అలెన్ నిరాశగా పెవిలియన్ కి చేరుకున్నాడు. అలెన్ కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించడం దానికి తోడు బ్యాట్ ఇరుక్కుపోవడం రెండు వెంటనే జరిగిపోయాయి. ఈ మ్యాచులో 9 బంతుల్లోనే 28 రన్స్ కొట్టి జట్టుకి మెరుపు ఆరంభానిచ్చినా సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ జట్టు 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి అలెన్ రనౌట్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
WHAT JUST HAPPENED⁉️
Was this the only way Finn Allen could get out tonight?
HEADS-UP play and a BEAUTIFUL throw from Shehan Jayasuriya!
4⃣2⃣/1⃣ (3.2) pic.twitter.com/GZk5bkYG4Q
— Major League Cricket (@MLCricket) July 16, 2023