భారీ షాట్లకు పెట్టింది పేరైన రస్సెల్.. మేజర్ లీగ్ క్రికెట్‌లో కొట్టిన సిక్సర్‌కు గ్యాలరీలో ఉన్న కుర్రాడి తలకు దెబ్బ తగిలింది. మ్యాచ్ అనంతరం బుడ్డోడిని దగ్గరకు తీసుకున్న రస్సెల్.. ఆటోగ్రాఫ్ ఇచ్చి దిల్‌ఖుష్ చేశాడు.
పరిమిత ఓవర్ల స్టార్ క్రికెటర్లందరూ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్, సియటెల్ ఒర్కాస్ మ్యాచ్ లో భాగంగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఓపెనర్ ఫిన్ అలెన్ అనుకోకుండా రనౌటయ్యాడు.