ఏ ఆట అయినా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పెద్దపెద్ద దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావొచ్చు. గతంలోనూ ఓ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ హ్యూజ్.. మెడపై బంతి తగలడం వల్ల మైదానంలో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత రక్షణ విషయంలో క్రికెట్ లో చాలా మార్పులు జరిగాయి. అయినా సరే కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. ఓ బాల్ వల్ల క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ విషయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. బుధవారం, హంబన్ తోట వేదికగా గాలే గ్లాడియేటర్స్- క్యాండీ ఫాల్కన్స్ జట్ల మధ్య మ్యాచ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే జట్టు.. 20 ఓవర్లలో 121/8 పరుగులు చేసింది. ఇక తర్వాత బరిలోకి దిగిన క్యాండీ జట్టు.. 15 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నె మూతి పళ్లు విరగడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఇక ఈ వీడియో కూడా వైరల్ గా మారడంతో అసలు ఏం జరిగిందా అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోనే చర్చనీయాంశంగా మారింది.
ఈ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. నువిందు ఫెర్నాండ్ క్రీజులో ఉండగా.. కార్లోస్ బ్రాత్ వైట్ బౌలింగ్ వేశాడు. అయితే బంతిని ఫెర్నాండో బలంగా బాదటానికి ప్రయత్నించాడు. కానీ బ్యాటుకు బాల్ కరెక్ట్ గా సెట్ కాలేదు. దీంతో బంతి గాల్లోకి లేచింది. దాన్ని క్యాచ్ పట్టడానికి చమిక కరుణరత్నె ట్రై చేశాడు. కానీ బాల్.. అతడి మూతిపై బలంగా తగలింది. ఇది జరిగిన కొన్ని క్షణాలకే నోటి నుంచి రక్తం కారిపోయింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. నోటికి సర్జరీ కూడా చేశారు. ఈ సంఘటనలో కరుణరత్నె మూతి పళ్లు నాలుగు పైనే విరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయం ఏంటి.. కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1
— Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022