నేడు పెరిగిపోతున్న జనాలను దృష్టిలో పెట్టుకుని కట్టడాలు పెరుగుతున్నాయి. భవనాలైనా, ఆసుపత్రులైనా రెండు, మూడు అంతస్థులను మించిపోతున్నాయి. అన్ని భవంతులు ఎక్కలేక.. లిఫ్ట్ వంటి సదుపాయలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ లిఫ్ట్ కారణంగా ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల ఎటు చూసినా కట్టడాలు, భవన సముదాయాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, జన సంచార ప్రాంతాల్లో భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గజం భూమి కూడా వేలల్లో ధర పలుకుతుంది. ఇక మహా నగరాల్లో కొనలేని పరిస్థితి. అందుకే కొంత భూమిలో కూడా ఆకాశ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు బిల్డర్స్. అయితే భవనం ఎంత పెద్దదైతే.. దానికుంటే సౌకర్యాలు మారిపోతుంటాయి. రెండు అంతస్థులా, మూడు అంతస్థులా అని తేడా లేకుండా.. పలు సదుపాయాలు కలిగి ఉంటున్నాయి. వాటిలో సీసీటీవీ, లిఫ్ట్, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వీటిల్లో లిఫ్ట్ చాలా ప్రమాదకారిగా మారుతోంది. ఈ లిఫ్ట్ పరోక్షంగా ఓ వ్యక్తిని బలితీసుకుంది.
ఓ హస్పిటల్‌లో చేరిన బంధువును చూద్దామని ఆసుపత్రికి వచ్చాడు వృద్ధుడు. అయితే నాలుగో ఫ్లోర్‌లో ఉన్నారని తెలిసి.. అక్కడకు వెళ్లాడు. ఇక ఇంటికి బయలు దేరేందుకు లిఫ్ట్ ఎక్కుదామని స్విచ్ నొక్కాడు. లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. కానీ లిఫ్ట్ రాలేదు. అది గమనించని వృద్ధుడు కాలు పెట్టడంతో అమాంతం కింద పడిపోయి చనిపోయాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలోని చంద్ర హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అశ్వర్థప్పగా పేర్కొన్నారు. ఒడిసి మండలం శేషయ్యవారిపల్లికి చెందిన డెబ్బై ఏళ్ళ అశ్వర్ధప్ప చంద్ర ఆసుపత్రిలో బంధువులు జాయిన్ అయ్యారని తెలిసి, వారిని చూడడానికి వచ్చి లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు.
నాలుగో ఫ్లోర్‌లో ఉన్నబంధువులను పరామర్శించి వెనుదిరిగిన అతడు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే సడన్‌గా లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. లిఫ్ట్ వచ్చిందనుకుని భావించిన ఆయన లోపలికి కాలు పెట్టాడు. కానీ లిఫ్ట్ రాలేదు. అప్పటికే అశ్వర్థప్ప కాలు లోపలికి పెట్టడంతో నాల్గొవ ఫ్లోర్ నుంచి అమాంతం గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు లిఫ్ట్ రాకుండా డోర్ ఎలా తెరుచుకుందనే అనుమానం వ్యక్తమౌతోంది. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లిఫ్ట్ రాకుండానే తలుపులు తెరుచుకున్నాయని అశ్వర్ధప్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పది రోజుల క్రితమే లిఫ్ట్ బాగుచేయించామని సిబ్బంది చెబుతుండగా.. దాన్ని తప్పుపట్టారు కుటుంబ సభ్యులు. ఈ లిఫ్ట్ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.