దేశ సేవ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతుంటారు జవాన్లు. కుటుంబాన్ని వదిలేసి.. ఇంటికి దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సరిహద్దుల్లో పహారా కాస్తారు. కఠినమైన శిక్షణలు తీసుకుంటారు. కానీ అవి ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఓ జవాన్ ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరాడు.
దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతుంటారు. ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. భార్యా బిడ్డలను, కుటుంబాన్ని వదిలేసి.. ఇంటికి దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సరిహద్దుల్లో పహారా కాస్తారు. తమను తాము మరింత మెరుగుపరుచుకునేందుకు ఎప్పటికప్పుడు పలు విషయాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు శిక్షణ తీసుకుంటారు. ఆ శిక్షణ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి ప్రమాదాలను తెచ్చిపెడుతుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో ఓ శిక్షణలో తీవ్ర విషాదం నెలకొంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ జవాన్ ప్రమాదవశాత్తు మరణించారు.
విశాఖ నేవి నుండి పశ్చిమ బెంగాల్‌కు శిక్షణ నిమిత్తం వెళ్లిన చందక గోవింద్ అనే నేవీ కమాండర్ ప్రమాదవశాత్తు మరణించాడు. పారాగ్లైడింగ్ శిక్షణ తీసుకుంటుండగా.. ప్యారాచూట్ తెరుచుకోకపోవడంతో కింద పడిపోయాడు. వంద కిలోమీటర్ల ఎత్తులో నుండి పడటంతో అతడి మరణించాడు. అతడిది విజయగనరం జిల్లా చీపురు పల్లిలోని పర్లా గ్రామ వాసి. బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండర్ గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు భారత వైమానిక దళం(ఐఎఎఫ్) వెల్లడించింది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో చాలా ఎత్తు నుండి పడిపోయినట్ల ఐఎఎఫ్ పేర్కొంది. దీంతో తీవ్ర గాయాలై గోవింద్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో తోటి జవాన్లు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. గోవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది. దేశానికి ఏదో ఒక సేవ చేయాలని తపనతో ఉండేవాడని, దేశ సేవ చేయడానికి ఎంతటి కఠిన శిక్షణనైనా తాను సిద్ధమని అనేవాడని, ఆ ధైర్యంతోనే ముందుకు సాగాడని బంధువు చెప్పారు. పర్లా గ్రామానికి అతడొక స్ఫూర్తి అని కొనియాడారు. విశాఖపట్నం తీరంలో మొహరించిన ఐఎన్‌ఎస్ కర్ణ (INS Karna) నౌకలో ప్రత్యేక దళం ‘నేవీ మెరైన్ కమాండోస్ (Marcos)’కు గోవింద్‌ను అటాచ్ చేసినట్లు తూర్పు నౌకాదళం తెలిపింది. బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని బార్జోరాలో ఒక ఫ్యాక్టరీ గేటు వెలుపల గోధుమ రంగు జంప్ సూట్, హెల్మెట్‌లో గోవింద్ కనిపించారు. ఆయన తన భుజాలకు పారాచ్యూట్ ధరించి ఉన్నారు.