యువకథానాయకుడు సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’, నోపార్కింగ్. సుశాంత్ కెరీర్‌లో కరెంట్, చి.ల.సౌ. తర్వాత పెద్దగా పేరు తెచ్చుకున్న సినిమాలు లేవు. ‘అల వైకుంఠపురం’లో నటనతో మెప్పించినా అది సపోర్టింగ్ రోల్ మాత్రమే. ఈసారి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు సుశాంత్. చిత్రీకరణ పూర్తి చేసుకున్నా… కరోనా కారణంగా థియేటర్లలో పార్క్ చేయాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్లు తెరవడంతో ఇక సందడి చేయడానికి రెడీ అయిపోయారు.
ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ‘వెంకట్’ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు వాహనాలు నిలుపరాదు చిత్రంలో హీరోయిన్ అన్నగా ప్రధాన పాత్రలో వెంకట్ సందడి చేయనున్నాడు.
ట్రైలర్‌లో లవ్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా సినిమాకి ప్రవీణ్ లక్కరాజు స్వరాలు సమకూర్చారు. ట్రైలర్ చూసిన అభిమానులు చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నోపార్కింగ్ ట్రైలర్‌ని మీరూ ఓసారి చూసేయండి.