కనుల విందు చేయనున్న ఫ్లవర్ షో
ఆన్ లౌన్ లో ఉటీ పువ్వుల ప్రదర్శన
ప్రదర్శనలో వెయ్యి విదేశీ పువ్వులు
స్పెషల్ రిపోర్ట్- పూలు.. అందానికి మారు పేరు. ఈ విశ్వానికి రంగులను పరిచయం చేసింది పూలేనని చెబుతారు. పూలను చూస్తే మనిషిలోని మానసిక పరిస్థితిలో మార్పు వస్తుందని, భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయని చాలా అధ్యయానాల్లో తేలింది. ఇక పువ్వులంటేనే పూజ.. ఆ భగవంతుడికి కూడా పువ్వులంటే చాలా ఇష్టం. ఇక ఆడవాళ్ల్గ పువ్వులది విడదీయలేని బంధం. ఇప్పుడు పువ్వుల గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నాం అనుకుంటున్నారా.. ఊటీ ఫ్లవర్ షో కు సమయం ఆసన్నమైంది మరి. ప్రతి సంవత్సరం సమ్మర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఊటీ ఫ్లవర్ షోను ఈ సారి కొవిడ్ లాక్ డౌన్ నేపధ్యంలో ఆన్ లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నీలగిరి జిల్లాలోని ఊటీ ప్రభుత్వ బొటానికల్ గార్డెన్‌లో ప్రతి సంవత్సరం మే నెలలో ఫ్లవర్ షో కన్నుల విందు చేస్తుంది. అటు రోజ్ గార్డెన్‌లో గులాబీల ప్రదర్శన, కున్నూర్ సిమ్స్ పార్క్‌లో పండ్ల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. కోతగిరి నెహ్రూ పార్క్‌లో కూరగాయల ప్రదర్శన, ప్రైవేటు సంస్థల తరఫున హెరిటేజ్ కార్ల ప్రదర్శన, పర్యాటన శాఖ తరఫున ఊటీ బోట్ హౌజ్ లో పడవ పోటీలను సమ్మర్ సెలబ్రేషన్స్ పేరుతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు.
ఊటీలో ఈ వేసవి సీజన్‌లో ఫ్లవర్ షో నిర్వహించాలని ఆరు నెలల క్రితమే నిర్ణయించారు. ఉద్యానవన శాఖ తరఫున బొటానికల్ గార్డెన్‌లో కొత్త రకాల పూలమొక్కలను పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు బొటానికల్ గార్డెన్‌లో సుమారు 30 వేల పూల కుండీల్లో విరమూసిన పూలు తమ అందాలతో అలరిస్తున్నాయి. ఈ పూలను ఆన్ లైన్ ద్వారా ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఉద్యానవన శాఖ. ఈ ఫ్లవర్ షోలో రోజ్ మేరీ, మెరిగోల్డ్, స్టార్ గోల్డ్, స్టార్ సాల్వేనియా, బ్లాక్, లిమోనియా, లిలి యమ్స్, సాల్వేనియా తదితర విదేశీ రకాల పూలను కూడా ప్రదర్శనకు ఉంచడం విశేషం. సో.. ఆన్ లైన్ లో అందాల పూల సోయగాలను చూసి ఎంజాయ్ చేయండి మరి.