సాధారణంగా సెలబ్రిటీలు ఎల్లప్పుడూ ఏదొక సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండటం రెగ్యులర్ గా చూస్తుంటాం. అభిమాన సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, బర్త్ డే వేడుకలు లేదా ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్లినప్పుడే ఫ్యాన్స్ చూసి ఆనందిస్తుంటారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఆనందానికి కారణం ఏంటనే విషయంలోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన ఇద్దరూ సోదరిలతో కలిసి ట్రిప్ కి వెళ్ళాడు. అలా ముగ్గురిని ఒక్కచోట చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక రామ్ చరణ్ తో పాటు సోదరిలు శ్రీజ, సుస్మిత కలిసి ఉన్న ఫోటోని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన సంతోషాన్ని బయటపెట్టారు. ‘తమ పిల్లలందరూ ఒక దగ్గర ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు.” అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలో చరణ్, శ్రీజ, సుస్మిత ముగ్గురూ కూడా ఊటీ ట్రిప్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఫోటో చూస్తుంటే ముగ్గురు చాలా ఆనందంగా అక్కడి వాతావరణాన్ని, ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెగా ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. మరి రామ్ చరణ్ తో ఉపాసన ఎక్కడని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మొత్తానికి చాలా రోజుల తర్వాత మెగా సన్, డాటర్స్ ఒకే చోట కనిపించడం.. మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులనే లైనప్ చేస్తున్నాడు చరణ్. మరి వైరల్ అవుతున్న మెగా ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.