మన చుట్టూ నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అక్కడక్కడ విద్యార్థులు కూడా ఉండటంతో.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.బైక్‌లపై వచ్చే విద్యార్థులను స్కూల్ లోపలకి అనుమతించరాదని చెన్నై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే.. స్కూల్ కు వచ్చేటపుడు, వెళ్ళేటప్పుడు విద్యార్థులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించడాన్ని సీరియస్ గా తీసుకుంది. గత నాలుగైదు ఏళ్లుగా నిత్యం విద్యార్థులు ఆక్సిడెంట్ల రూపంలో ప్రాణాలు కోల్పోతుండడంతో ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది.
తమిళనాడు విద్యాశాఖ.. పాఠశాలలకు పంపిన ఉత్తర్వుల్లో, పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి బస్సులు ఎక్కే సమయంలో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా.. ప్రమాదాల రూపంలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని అడ్డుకొనేలా ఒక తరగతి విద్యార్థులను వదిలిన 15 నిమిషాల తర్వాత మరో తరగతి విద్యార్థులను బయటకు పంపాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిఅలాగే, 18 ఏళ్లు నిండని విద్యార్థులు ద్విచక్రవాహనాలపై వస్తే వారిని పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించరాదని, ఈ మార్గదర్శకాల పర్యవేక్షణకు ప్రత్యేక ఉపాధ్యాయుల బృందం నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పడూ ప్రమాదాలు జరిగాక స్పందించే ప్రభుత్వాలు.. ఇలా ముందు చూపుగా ఆలోచించడం మంచి నిర్ణయమని అభిప్రాయ పడుతున్నారు.