ఎండాకాలం వచ్చిందంటే జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటే కానీ బయటికి వెళ్లేందుకు ఇష్టపడరు. గత కొన్ని రోజులుగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ నుంచి తప్పించుకునేందుకు జనాలు రక రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక శీతల పానియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎక్కడ చల్లని పదార్థాలు ఉన్నా అక్కడికి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే ఎండా కాలం అంటేనే పెళ్లిళ్ల సీజన్. ఇక వివాహ కార్యక్రమాలకు హాజరు అయ్యేవారు నానా తంటాలు పడుతుంటారు.
పెళ్లి బారాత్ లో వధూ వరులకు ఏ ఇబ్బంది రాకుండా ఢిల్లీలో ఒక కుటుంబం భలే ఉపాయం ఆలోచించారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారు. ఆ పందిరి కింద వధూ-వరులను ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ముందు డీజే, డప్పు శబ్ధాలతో బంధువులు డ్యాన్సులతో హూరెత్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కోహ్లీ అనే మహిళ ట్విట్టర్ పోస్ట్ చేసింది.
ఈ ట్విట్ పై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు. ఇలాంటి పెళ్లి బారాత్ మేము జీవితంలో చూడలేదు..భలే ఐడియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కదిలే పందిరి కింద బరాత్ తీస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎండ నుంచి సేదతీరేలా ఉన్న ఈ ఐడియా గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is why #India is called land of Innovation or simply
“Jugaad” To beat the #Heatwave during “Baraat” Indians have found solution.#innovation pic.twitter.com/Fs8QociT2K— Devyani Kohli (@DevyaniKohli1) April 27, 2022