అగ్రికల్చర్ డెస్క్- ఓ వైపు కరోనా.. మరో వైపు అకాల వర్షాలు. ఎండాకాలంలో పట్టణాల్లో ఉండేవారికి వర్షాలు పడితే ఉల్లాసంగానే ఉంటుంది కానీ.. పల్లెటూర్లలో వ్యవసాయం చేసే రైతులకు మాత్రం అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడతాయి. చేతికి వచ్చిన పంటను ఈ వర్షాలు నాశనం చేస్తాయి. ప్రస్తుతం పల్లెల్లో వరి పంటను కోసి ధాన్యాన్ని పొలంలో ఆరబోయగా.. అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ ఏడాది వరిధాన్యం చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. రైతులకు ఒక పక్క కరోనా సమస్య దానికి మించి దిగుబడి అయిన పంటలను సమయానుకూలంగా అమ్ముకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో పడుతున్న ఈ వానల వల్ల తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో గోదాముల వద్ద రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దైపోతుంది.
ఈ తడిచిన వడ్లను కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు అంతాగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక కొత్త ఆలోచన చేశారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం వానకు తడిచిపోతుంటే అన్నదాతల బాధలు వర్ణాతీతం. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు, ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేవలం 500 రూపాయల ఖర్చుతో ఆరబోసిన లేదా గోదాముల బయట ఎండబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవ్చని ప్రాక్టికల్ గా చేసి చూపించారు. మొదటగా ఒక టార్ప్ లైన్ కింద పర్చి దాని మీద ధాన్యం బస్తాలను రాశులుగా అమర్చుకోవాలి. ధాన్యం బస్తాల చుట్టు పర్చిన టార్ప్ లైన్ పైకి మడిచి దానితో పాటు మార్కెట్ లో దొరికే ప్లాస్టిక్ కవర్ అంటే ష్రింక్ వ్రాప్ తో పూర్తిగా చుట్టివేయాలి.
ధాన్యం బస్తాలలో ఉంచినదే కాకుండా కుప్పగా ఉన్నా ధాన్యాన్ని సైతం రాశిగా పోసి దాని చుట్టూ వెదుకు బొంగులు లేదా కడ్డిలు పేర్చి ఈ ప్లాస్టిక్ కవర్ తో చుడితే ధాన్యం తడవదు. ఈ పద్దతిలో టార్పైలైన్ లేకున్నా రాళ్ల మీద వేసిన బస్తాలకు, ఇటుకల మీద పెట్టిన బస్తాలకు కూడా ఈ పేపర్ చుడితే సరిపోతుంది. ఈ పద్దతిలో అసలు టార్ప్ లైన్ అవసరం ఉండదు. బయట మార్కెట్ లో ఒక్కో టార్ప్ లైన్ ధర క్వాలటీని బట్టి సుమారు 8వేల వరకు ఉంది. కానీ ఈపద్దతిలో కింద వేసిన టార్ప్ లైన్ 2వేల రూపాయలు, ప్లాట్సిక్ కవర్ కు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో 100 కింట్వాళ్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు.
రెండు మూడు వారల నుంచి రెండు మూడు నెలల వరకు ఇందులోనే ధాన్యాన్ని ఉంచవచ్చు. ఇక ఎలకలు ధాన్యం కొట్టకుండా కింద ఒక రేకు షీట్ వేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ కవర్ హైదరాబాద్ లో దొరుకుంతుంది. ప్యాకింగ్ ఇండస్ట్రీ మెటీరియల్ అమ్మే దగ్గర కేజీ 120 రూపాయలు మాత్రమే. 400 రూపాయలకు 500 చదరపు అడుగుల రాప్ వస్తుంది. ఇది ప్రస్తుతం అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. వంద క్వింటాళ్ల పంట నిల్వకు కేవలం 500 రూపాయల ప్లాస్టిక్ కవర్ అవసరమవుతుంది. కరోనా కష్ట కాలంలో ఈ అద్భుతమైన ఐడియా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.