హెల్త్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. మానవాళికి శాపంగా మారి.. ప్రాణాలను హరిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని కబలించేస్తోంది. కరోనా లక్షణాలు కొందరిలో కనిపించినా.. మరి కొందరిలో ఏ మామాత్రం సింప్టమ్స్ కనిపించడం లేదు. కరోనా రోజుకో రూాపాన్ని సంతరించుకుంటూ.. కొత్త కొత్త లక్షణాలను బయటపెడుతోంది. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం, డయేరియా వంటి లక్షణాలను మాత్రమే వైద్య నిపుణులు గుర్తించారు. వీటిలో ఓ ఒక్క లక్షణం రెండు మూడు రోజులు కంటిన్యూగా ఉన్నా కరోనా గా అనుమానించాలని చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐతే ఇప్పుడు కరోనా మ్యుటేషన్ మార్చుకుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు గుర్తించారు. మెల్ల మెల్లగా కరోనా సోకిన వారి లక్షణాల్లో మార్పులు వస్తున్నాయని వీరు చెబుతున్నారు. తాజాగా మరో కొత్త కరోనా లక్షణాన్ని గుర్తించారు.
కరోనా ఇప్పుడు కొత్తగా మనిషి నోట్లోని నాలుకపై ప్రభావం చూపుతోందట. ఇందులో ప్రధానంగా నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నాలుకపై చిన్న చిన్న గాయాలు కావడం వంటి లక్షణాల రూపంలో కరోనా బయటపడుతోందట. ఇటివంటి లక్షణాలు ఏ మాత్రం కనిపించినా దాన్ని కరోనాగా అనుమానించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఇప్పుడు కొవిడ్ టంగ్ గా పిలుస్తున్నారు వైద్యులు. ఇందులో ప్రధానంగా ముందు నాలుక మొద్దుబారినట్లు అవ్వడం, తరువాత నోరు ఎండిపోవడం, నాలుకపై దురద రావడం, నాలుకపై ఎదో గీసుకున్నట్లు గాయాలు కావడం వంటి లక్షణాలు క్రమంగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత కాస్త జ్వరం కూడా వస్తుందట. ఇలాంటి లక్షణాలున్న వారిని పరీక్షించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వీరు చెప్పారు. అందుకని కాస్త ఇలాంటి లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.