స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. ఎక్కడ ఏంజరిగినా క్షణాాల్లో అందరికి చేరుపోతుంది. ఇఖ సోషల్ మీడియా కేవలం సమాచారానికి, కబుర్లకే కాదు.. ఆదాయానికి కూడా ఓ మార్గమని చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా పోస్టుల ద్వార సెలబ్రెటీలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా, ప్రపంచ ఫుట్ బాల్ ప్లెయర్ క్రిస్టియానో రొనాల్డో వంటి వారు ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోట్లలో ఆదాయం పొందుతున్నారు. ఇటీవలే హాపర్ హెచ్ క్యూ సంస్థ సెలబ్రిటీల ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ తెలుగు హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఉండడం విశేషం.
హాపర్ హెచ్ క్యూ జాబితాలో వరల్డ్ వైడ్ గా అశ్రిత 377వ స్థానం దక్కించుకుంది. ఇక ఆసియాలో చూస్తే ఆమె 27వ స్థానంలో ఉంది. వెంకటేష్ కూతురు అశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు సుమారుగా 29 వేల ఆదాయం వస్తుందట. ఇక అశ్రిత ఇన్ స్టాగ్రామ్ పోస్టుల్లో ఉండేది కేవలం వంటల వీడియోలు. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఉన్న అకౌంట్ తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది.
అన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు మొత్తం 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటుంది. అశ్రిత ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటోంది. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరగ్గా, అప్పటి నుంచి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో ఉంటోంది హీరో వెంటకేశ్ కూతురు అశ్రిత.