ఓ సినిమాతో మొదలైంది వాళ్ల పరిచయం. అతడేమో దర్శకుడు, ఆమె హీరోయిన్. వర్క్ కోసం కలిశారు. లవ్ లో పడ్డారు. తాజాగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఎవరు? వాళ్ల లవ్ స్టోరీ ఏంటి?
ఈ మధ్య అంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల్లో చాలామంది మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. రీసెంట్ గా టీమిండియాలోని ఇద్దరు ముగ్గురు క్రికెటర్లు కూడా తమ నచ్చిన అమ్మాయితో ఏడడుగులు వేశారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి ఏ డైరెక్టర్ తో అయితే రిలేషన్ లో ఉందో.. తాజాగా అతడితోనే ఏడడుగులు వేసింది. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో వధూవరులు ఇద్దరూ కూడా అందంగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హిందీ సినిమాలు-ఆల్బమ్ సాంగ్స్ చూసేవాళ్లకు నటి శివలీకా ఒబెరాయ్ పరిచయమే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. నటిగా మారడం కంటే ముందు ‘కిక్’, ‘హౌస్ ఫుల్ 3’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. ‘హే షాలీ ఆషికీ’ మూవీతో నటిగా అరంగేట్రం చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా నామినేట్ అయింది. ఇక ఆ తర్వాత ‘ఖుదా హఫీజ్’ మూవీతో పాటు దాని సీక్వెల్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమా చేస్తున్న టైంలోనే నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ పాఠక్ తో లవ్ లో పడింది. ఈ ఇద్దరూ డేటింగ్ అంటూ గతంలో రూమర్స్ కూడా వచ్చాయి.
వాటన్నింటికీ చెక్ పెడుతూ.. గతేడాది జులై 24న తమకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు పోస్ట్ పెట్టింది. హిందీలో ‘దృశ్యం’ని రీమేక్ చేసి హిట్ కొట్టిన డైరెక్టర్ అభిషేక్.. గతేడాది ‘దృశ్యం 2’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఆ ఆనందంలోనే శివలీకాని తాజాగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఫిబ్రవరి 9న గోవాలో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇక తన పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన శివలీకాకు.. సహ నటీనటులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ప్రియుడిని మనువాడిన శివలీక ఫొటోలు మీకెలా అనిపించాయి. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.