RRR Pre Release Event : దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్‌ఎస్ రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసి.. తెలుగు సినిమా పవర్ ఇది అని చాటి చెప్పారు. బహుబలి సినిమాతో ఓ ట్రెండ్ సెట్ చేశారు. రికార్డులను బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఆ రికార్డులను బద్ధలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షక మహాజనం ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నందమూరి, మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్. నిన్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై , మంత్రి సుధాకర్, హీరో శివరాజ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈవెంట్‌లో భాగంగా శివరాజ్‌కుమార్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి మాట్లాడటానికి స్టేజీ మీదకు ఎక్కారు. శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. అభిమానులు గట్టిగా అరుస్తూ ఉన్నారు. అభిమానులను అరుపులు ఆపమని, తాను మాట్లాడతానని శివన్న అడుగుతూ ఉన్నారు. అరుపులు ఆగలేదు. దీనికి తోడు స్టేజిమీద గుంపులు, గుంపులుగా బాడిగార్డులు, డ్యాన్సర్లు, పర్‌ఫార్మర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి మైక్ అందుకుని …‘‘ బాడీ గార్డ్స్ అందరూ కిందకు దిగిపోండి అక్కర్లేదు. పోలీసులు మాత్రమే స్టేజిమీద ఉండండి. డ్యాన్సర్లు.. పర్‌ఫార్మర్లు అందూ స్టేజి మీదనుంచి వెళ్లిపోండి..’’ అంటూ సీరియస్ అయ్యారు. గట్టిగా అరుస్తూ.. అటుఇటు తిరుగుతూ స్టేజీని క్లియర్ చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రికి రక్షణగా ఉండాలని బాడీగార్డులను గదమాఇంచారు. రాజమౌళి ఉగ్రరూపంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RRR కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్. ఎటు చూసినా అభిమాన సంద్రమే!