దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు అదే జోష్ తో శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈ మూవీ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మద్య షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ తాజాగా లీకైంది. ఈ పిక్ లో రామ్ చరణ్ ఒక పాత సైకిల్ పై తెల్ల చొక్కా, దోతి తో కనిపిస్తున్నాడు. ఈ పిక్ శంకర్ తీస్తున్న మూవీ నుంచి లీక్ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడా.. లేక డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నాడా తెలియాల్సి ఉంది. ఈ ఫొటోను రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.