Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయకు ఇతర దేశాలనుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కేవలం సినిమా ఆఫర్లే మాత్రమే కాదు. యాడ్స్‌లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన గుమ్మం ముందుకు వస్తున్నాయి. భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చరణ్ తాజాగా, హీరో బైక్ యాడ్‌లో నటించటానికి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా తాజాగా పూర్తయింది. ఆ యాడ్ మరికొద్ది రోజుల్లో జనాల ముందుకు రానుంది. హీరో బైక్ యాడ్‌లో నటించటానికి రామ్ చరణ్ భారీగా ఛార్జ్ చేశారని టాక్. ఆ మొత్తం రూ. 7 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. చరణ్‌కు ఉన్న ఇంటర్‌నేషనల్ క్రేజ్‌కు ఆ మొత్తం చాలా తక్కువన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, చరణ్ ప్రస్తుతం ఆర్‌సీ 15లో నటిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మరి, ఓ యాడ్ కోసం చరణ్ 7 కోట్ల రూపాయలు తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : CPI Narayana: జూనియర్ NTRకు ఏం కర్మ పట్టింది.. ఆ క్రిమినల్‌తో పనేంటి?: సీపీఐ నారాయణ