'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ అయిపోయిన ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ తో అభిమానుల మధ్య డిస్కషన్ కు కారణమైన చరణ్.. ఇప్పుడు తన షర్ట్ కాస్ట్ తో వైరల్ గా మారిపోయాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పొద్దుపొద్దునే కొత్త సినిమా టైటిల్ ‘గేమ్ ఛేంజర్’ అని అనౌన్స్ చేశారు. మధ్యాహ్నం పోస్టర్ రిలీజ్ చేశారు. అది కాకుండా టాలీవుడ్ కు చెందిన దర్శక, నిర్మాతలు చాలామంది ఇంటికెళ్లి మరీ విష్ చేశారు. ఇక నైట్ పార్టీ కూడా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. భార్య ఉపాసనతో కలిసి చరణ్ ఫొటోలకు పోజిలిచ్చాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ పుట్టినరోజు రామ్ చరణ్ వేసుకున్న ఓ షర్ట్ మాత్రం అభిమానుల మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోలు ఏదైనా షర్ట్, ప్యాంట్, షూస్, స్లిప్లర్స్, వాచీ.. ఇలా ఏది ధరించినా సరే దాని రేట్ ఎంత? ఎక్కడ దొరుకుతుంది? లాంటి వాటి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి ఖరీదు చూసి అవాక్కవుతున్నారు. అలా చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల వాచీలు, హుడీల రేట్ తెగ వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ లిస్టులోకి రామ్ చరణ్, తన బర్త్ డే రోజు వేసుకున్న షర్ట్ కూడా చేరిపోయింది. అభిమానులు దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇంటికొచ్చి విష్ చేశారు. ఈ టైంలో లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ తో మెగాహీరో కనిపించాడు. దీని గురించి సెర్చ్ చేయగా.. ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉన్న దీని ధర 983 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.80,961 అని తెలుస్తోంది. ఇక ఈ కాస్ట్ చూసి అభిమానులు.. వామ్మో అనుకుంటున్నారు. ‘ఇదే డబ్బులు పెడితే ఓ పదిపదిహేనేళ్ల పాటు షర్ట్స్ కొనుక్కోవచ్చు’ అని ఫ్యాన్స్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే చరణ్ బర్త్ డే షర్ట్ కాస్ట్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.